![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -315 లో....భద్రం తన నోటితోనే ధన, సందీప్ లు తప్పు చెయ్యలేదని చెప్పాలంటే వాడి డిఫెక్ట్స్ నాకు తెలియాలని భద్రం ఆఫీస్ కి వెళ్తాడు సీతాకాంత్. అక్కడ పిఏ సీతాకాంత్ ని చుసి పారిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకొని భద్రం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తను ఇప్పటివరకు చేసిన స్కామ్ లు అన్ని తెలుసుకొని ఈ విషయాలన్నీ నేను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలని సీతాకాంత్ అనగానే.. అతను సరే అంటాడు.
అక్కడ సీతాకాంత్ ఆటో చూసిన రామలక్ష్మి... సీతా సర్ ఇక్కడున్నాడేంటి? ధన, సందీప్ లని విడిపించడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటుంది అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఇక్కడున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ప్యాసింజర్స్ ని తీసుకొని వచ్చానని అతను చెప్తాడు. రాజీవ్ స్టేషన్ కి వెళ్లి.. ధన, సందీప్ లు బయటకు రావాలంటే సీఐ కి ఏంత కావాలని కానిస్టేబుల్ ని అడుగుతాడు. అప్పుడే సీఐ వస్తాడు. ఏంటని అడుగుతుంటే. నా వస్తువు పోయింది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని కవర్ చేస్తాడు రాజీవ్. సీతాకాంత్ వచ్చి సీఐతో నేను పర్సనల్ గా భద్రంతో మాట్లాడాలని అనగానే సరేనని సీఐ పంపిస్తాడు. నీ తప్పులు మోసాలన్నీ తెలుసంటూ భద్రం పిఏని పిలిపిస్తాడు. నువ్వు ఇప్పుడు ధన, సందీప్ లది ఏ తప్పు లేదని చెప్తే సరే.. లేదంటే నువ్వు చేసిన మోసాలన్నీ చెప్తే ఇక లైఫ్ లాంగ్ జైల్లో నే ఉంటావని సీతాకాంత్ అనగానే.. భద్రం భయపడి సీఐతో నాదే తప్పు వాళ్లదేమీ లేదని చెప్తాడు. నేనే వాళ్ళని విడిపించానని చెప్పొద్దని సీఐతో సీతాకాంత్ చెప్తాడు. అదంతా రాజీవ్ విని ఇది మన అకౌంట్ లో వేసుకుందామని అనుకుంటాడు. ఇక శ్రీలతతో నేనే విడిపించానని చెప్తానని రాజీవ్ అనుకుంటాడు.
మరోవైపు శ్రీలత ఇంటికి సీతాకాంత్ వెళ్తాడు. ఎందుకు వచ్చావ్ వాళ్ళని స్టేషన్ లో పెట్టావ్.. విడిపించమంటే నువ్వు నీ భార్య కలిసి సిరిని బాధపెట్టి పంపించారని శ్రీలత కోప్పడుతుంది. అమ్మ సిరి అంత నువ్వు కోరుకున్నట్లు జరుగుతుందని చెప్పి సీతాకాంత్ వెళ్ళిపోతాడు. అన్నయ్య అలా అంటున్నాడు విడిపించాడా అని సిరి అనుకుంటుంది. ధన, సందీప్ లు బయటకు వస్తారు. హమ్మయ్య నేను చేసిన ప్రయత్నం పలించింది అని రాజీవ్ అనగానే.. ఏంటి నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది నువ్వా అని ధన, సందీప్ లు అంటారు. అవునని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |